Abn logo
Sep 26 2021 @ 00:21AM

తుఫాన్‌ ముప్పు

నేడు భారీవర్షాలు, తీరం వెంబడి పెనుగాలులు

అప్రమత్తమైన అధికారులు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

నేడు, రేపు పలు రైళ్లు రద్దు


విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయానికి తుఫాన్‌గా మారడంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం నగరంతో పాటు రూరల్‌లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గాలులు పెరిగాయి. తుఫాన్‌ ఆదివారం సాయంత్రం కళింగపట్నం-గోపాలపూర్‌ మఽధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. తహసీల్దార్లు స్థానికంగా వుండి మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలను అప్రమత్తం చేశారు. అధికారులు, సిబ్బంది సెలవులో వుంటే వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి 27 మందితో కూడిన బృందం నగరానికి చేరుకుంది. అత్యవసరం అనుకున్న చోటకు వీరిని తరలించనున్నారు. కాగా ఆదివారం సాయంత్రం తుఫాన్‌ తీరం దాటే సమయంలో జాతీయ  రహదారులపై వాహన రాకపోకలను నిలిపివేయాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


అప్రమత్తంగా ఉండండి

తుఫాన్‌ నేపథ్యంలో నగర వాసులంతా అప్రమత్తంగా వుండాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఒక ప్రకటనలో కోరారు. విద్యుత్‌ సరఫరాకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఏదైనా అవసరమైతే జీవీఎంసీ హెల్ప్‌లైన్‌ 180042500009,0891-2869106కి సంప్రతించాలని కోరారు. 


నేడు, రేపు పలు రైళ్లు రద్దు

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో పలు ప్రత్యేక  రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ అధికారులు ప్రకటించారు.


ఆదివారం రద్దయిన రైళ్లు

భువనేశ్వర్‌-విశాఖ-భువనేశ్వర్‌ (08568/08570), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (07015), భువనేశ్వర్‌-తిరుపతి (02071), పూరీ-గుణుపూర్‌ (08417), పూరీ-చెన్నై (02859), గునుపూర్‌-విశాఖ-గుణుపూర్‌ (08521/08522), విశాఖ-టాటా (08572), విశాఖ-కూర్బా-విశాఖ (08518/08517), సంబల్‌పూర్‌-నాందేడ్‌ (02085), రాయపూర్‌-విశాఖ-రాయపూర్‌ (08527/08528), విశాఖ-రాయగడ (08508), రాయగడ-గుంటూరు (07244), భువనేశ్వర్‌-బెంగళూరు (08463), భువనేశ్వర్‌-యశ్వంత్‌పూర్‌ (02845)


సోమవారం రద్దయినవి...

తిరుపతి-భువనేశ్వర్‌ (02072), గుణుపూర్‌-పూరీ (08418), చెన్నై సెంట్రల్‌-పూరీ (02860), టాటా-విశాఖ (08571), నాందేడు-సంబల్‌పూర్‌ (02086), రాయగడ-విశాఖ (08507), బెంగళూరు-భువనేశ్వర్‌ (08464), యశ్వంత్‌పూర్‌-భువనేశ్వర్‌ (02846)


కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 

0891-2590100, 2590102

టోల్‌ఫ్రీ నంబరు 1800 425 00002

జీవీఎంసీ హెల్ప్‌లైన్‌ 0891-2869106, 180042500009