ఏఎన్‌ఎంలపై బదిలీల పిడుగు

ABN , First Publish Date - 2022-08-08T04:50:01+05:30 IST

వైద్యారోగ్యశాఖలో సంస్కరణల ఫలితం ఏఎన్‌ఎంలకు సంకటంగా మారింది. ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఒక ఏఎన్‌ఎం ఉండాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రెగ్యులర్‌ ఏఎన్‌ఎంల్లో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలు 1,058 ఉండగా వాటిలో 834 మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లోనే ఈ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.

ఏఎన్‌ఎంలపై బదిలీల పిడుగు

 వైద్యారోగ్యశాఖలో సంస్కరణల ఫలితం

ఖాళీగా ఉన్న సచివాలయాల్లో పోస్టుల భర్తీ

పీహెచ్‌సీలలో ఉన్నవారు వెళ్లాల్సిందే..

నేడు కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 7 : వైద్యారోగ్యశాఖలో సంస్కరణల ఫలితం ఏఎన్‌ఎంలకు సంకటంగా మారింది. ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఒక ఏఎన్‌ఎం ఉండాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రెగ్యులర్‌ ఏఎన్‌ఎంల్లో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలు 1,058 ఉండగా వాటిలో 834 మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లోనే ఈ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలతో భర్తీచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆయా ఖాళీలను సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీలు పశ్చిమప్రాంతంలోని మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ కౌన్సెలింగ్‌లో ఒంగోలు, సమీప నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు ఇతర ప్రాంతాలకు బదిలీ కావాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం దూరప్రాంతాలకు వెళ్లి పనిచేయాలంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తాము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోఏళ్ల నుంచి పశ్చిమ ప్రాంతంలో పనిచేస్తూ ఏడాది క్రితం ఒంగోలు సమీప ప్రాంతాలకు బదిలీపై వచ్చిన ఏఎన్‌ఎంలు ప్రస్తుతం ఏ ప్రాంతానికి  వెళ్లాల్సి వస్తుందోనని కలవరపడుతున్నారు. 


Updated Date - 2022-08-08T04:50:01+05:30 IST