పిడుగుల కాలం.. జరభద్రం!

ABN , First Publish Date - 2022-05-05T05:23:17+05:30 IST

పిడుగుల కారణంగా ఏడా దికి సుమారు 24 వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి.

పిడుగుల కాలం.. జరభద్రం!

జిల్లాలో పలుచోట్ల పిడుగు ప్రమాదాలు

కామారెడ్డిలో ఓ మహిళ, సదాశివనగర్‌, బీబీపేటలో పశువుల 

జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిఫుణులు


కామారెడ్డిటౌన్‌,మే 4: పిడుగుల కారణంగా ఏడా దికి సుమారు 24 వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలు ప్రారంభమవడంతోపాటు అటురైతులు,ఇటు సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలీలు, రైతులు,పశువుల కాపర్లు పిడుగుపాటుకు గురవుతున్నారు.చెట్ల కింద కట్టేసిన పశువులు సైతం పిడుగుపాటుతో ప్రమాదానికి గురై మరణిస్తున్నాయి. ప్రస్తుతం పిడుగుల కాలమని ప్రజలు భద్రంగా ఉండాల్సిందేనని ని ఫుణులు పేర్కొటున్నారు. గత 15 రోజుల క్రితం కా మారెడ్డి పట్టణంలోని లింగాపూర్‌ శివారులో పిడుగుపాటుతో ఓ మహిళ కూలీ మృతిచెందడంతో పాటు మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. సదాశివనగర్‌ మండలం ఉత్తునూర్‌ గ్రామంలో చెట్టుక్రింద కట్టెసిన ఒక ఆవు, గేదెపై పిడుగుపడడంతో  మృ త్యువాత పడ్డాయి. అలాగే బీబీపేట మండలం జనగామ గ్రామంలో మంగళవారం పిడుగు పడడంతో 4 మేకలు, 1 గొర్రె మృత్యువాడ పడ్డాయి. మరో 5 మేకలు తీవ్ర గాయాలపాలయ్యాయి. ఇలా జిల్లాలో పలుచోట్ల పిడుగుపాటుతో పెను ప్రమాదాలే జరుగుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు చెట్ల కింద, ఎతైన ప్రదేశాలలో ఉండకుండా అప్రమత్తత పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

పిడిగు పడినప్పుడు 

2900 సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉత్పన్నం

పిడుగుపాటు విషయంలో ప్రధానంగా పల్లెల్లో అనేక కథలు ప్రచారం ఉన్నాయి. దేవదానవ యు ద్ధం కారణంగా ఇలా ఉరుములు, మెరుపులు వస్తాయని మెరుపులు వచ్చే సమయంలో అర్జున,పాల్గుణ అంటే వారు మనల్ని పిడుగుల భారి నుంచి రక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇవి ఏ మాత్రం సహేతుకం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా సుర్యుని ఉపరితలంపై 5700 సెల్సియస్‌ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితల ఉష్ణోగత్రకు సుమారు 5 రెట్లు అధికంగా 2700 సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ముఖ్యంగా డిసెంబరు, జనవరి, ఏప్రిల్‌, మే నెలల్లో ఈ తరహాలో అకాల వర్షాలు పడడం, వడగండ్లుపడడంతో పాటు పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాసంగి పంటలు కోతకు వచ్చే సమయం కావడంతో పాటు ధాన్యం కుప్పల వద్ద రైతులు సేదతీరడం, ఎండవేడికి పశువులను రక్షించుకునేందుకు చెట్ట కింద కట్టేయడం లాంటివి చేస్తుంటారు. వాతావరణంలో మార్పులు రావడంతో పాటు పెద్ద ఎత్తున గాలులు, ఆకాశంలో మెరుపులు కనిపించినప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పశువులను సైతం సురక్షితప్రాంతాలకు తరలించాలి.

నిఫుణులు సూచిస్తున్న జాగ్రత్తలు

జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిడుగుపాటు నుంచి బయటపడవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు. ఉరుములు,మెరుపులు, పిడుగులు పడే సమయంలో ఫోన్‌లు మాట్లాడకపోవడమే మంచిది. ఉరుములు,మెరుపులు వేళలో టీవీలు చూడడం ప్రమాదకరం. అంతేకాక స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్‌లు తీసివేయాలి. లేదంటే ఎలక్ట్రిక్‌ వస్తువులు పాడయ్యే ప్రమాదముంటుంది. ఇంటి కీటికీలు, తలుపుల దగ్గర నిలబడి బయటకు చూడడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లకిందకు వెళ్లకూడదు. ఒకవేళ బయట ఉన్నప్పుడు ఉరుములు,మెరుపులు పడే అవకాశముంటే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూర్చోని రెండు కాళ్లమధ్యతల ఉంచి చెవులు, కళ్లు ముసుకుని ఉండాలి. పెంపుడు జంతువులను ఎట్టిపరిస్థితుల్లో బయట వదిలేయకుండా షెడ్లలో ఉంచాలి. ఉరుముల వేళ శరీరం జలదరింపునకు గురి కావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయని ఇలా జరిగితే పిడుగు మీ దగ్గరలో పడుతున్నట్లు అర్థం. అప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.


Read more