Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 07:59AM

Delhi: నేడు భారీవర్షాలు..ఢిల్లీలో ఆరంజ్ అలర్ట్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది. ఢిల్లీలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీవాసులకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా వర్షాలు కురవనున్నందున ఐఎండీ ఢిల్లీవాసులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీవర్షాల వల్ల ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీ, ముండ్కా అండర్ పాస్, రోహతక్ రోడ్డు ప్రాంతాల్లో వర్షపునీరు నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.సఫ్దర్ జంగ్, లోధీరోడ్డు, రిడ్జ్ ఏరియా, నోయిడా, పిటంపుర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement