Abn logo
Sep 19 2021 @ 00:50AM

రూ.18 లక్షలపై.. పిడుగు !

కాలుతున్న ఇల్లు..

చింతలపూడి, సెప్టెంబరు 18 : ఆ యువకుడు ఉన్నత చదువుల నిమిత్తం.. ఉన్న కాస్త పొలాన్ని అమ్మేశారు. వచ్చిన సుమారు రూ.18 లక్షల నగదును ఇంటిలో భద్రపరిచారు. ఇంతలో తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లారు. ఈ లోగా వీరి ఇంటిపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ  ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు తప్పించుకున్నారు. కానీ, బీరువాలోవున్న మొత్తం రూ.18 లక్షల విలువైన నోట్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో బాధిత కాళ్ల మహేష్‌బాబు, అతని తల్లి కృష్ణవేణి కుటుంబం కన్నీరు మున్నీరైంది. 



కాలిన నోట్లు