గంగూలీ, నిఖత్ జరీన్, అవని లేఖర విజయగాధలతో థమ్స్ అప్ హర్‌హాథ్ తూఫాన్ క్యాంపెయిన్

ABN , First Publish Date - 2022-07-29T02:56:40+05:30 IST

కోకా-కోలా ఇండియా బిలియన్ డాలర్ స్వదేశీ బ్రాండ్ థమ్స్ అప్.. భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని

గంగూలీ, నిఖత్ జరీన్, అవని లేఖర విజయగాధలతో థమ్స్ అప్ హర్‌హాథ్ తూఫాన్ క్యాంపెయిన్

న్యూఢిల్లీ: కోకా-కోలా ఇండియా బిలియన్ డాలర్ స్వదేశీ బ్రాండ్ థమ్స్ అప్.. భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్మరించుకుంటూ కొత్త క్యాంపెయిన్‌కి తెరలేపింది. హర్‌హాథ్‌తూఫాన్ హ్యాష్‌టాగ్‌తో స్ఫూర్తిదాయకులైన వ్యక్తులను ఘనంగా శ్లాఘించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా తమ మార్గానికి అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నింటినీ అధిగమించి ధైర్యసాహసాలు, మొక్కవోని పట్టుదల, నిలకడైన శక్తిని చూపిన వారి ధీరోదాత్తతను సంబరంగా జరుపుకుంటోంది. ఒక బలవంతపు సందేశం, సృజనాత్మక దార్శనికతతో, ప్రేక్షకులు, శ్రోతలలో గాఢమైన దేశభక్తిని తట్టి లేపడానికి థమ్స్ అప్ లక్ష్యంగా చేసుకుంది. ఈ క్యాంపెయిన్‌లో కథ చెప్పే శైలి, శక్తివంతమైన యానిమేషన్ రూపంలో ఉంది. అది పౌరుల్లో  దేశభక్తిని ప్రేరేపిస్తోంది. 


భారత క్రికెట్ జట్టులో ఆత్మవిశ్వాసం, నిర్భీతిని నింపి జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చిన టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ,11 ఏళ్ల వయసులో ప్రమాదములోకాళ్ళు పోగొట్టుకున్నప్పటికీ పారాలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ అవని లేఖర, మహిళా బాక్సర్, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ 2022 బంగారు పతక విజేత నిఖత్ జరీన్  వంటి క్రీడాకారుల స్ఫూరిదాయక కథలను కలిగి ఉంది. కాగా, క్యాంపెయిన్‌లో డిజిటల్ మీడియాపై రూపొందించిన ఆరు లఘుచిత్రాలను కూడా థమ్స్ అప్ విడుదల చేయనుంది. 

Updated Date - 2022-07-29T02:56:40+05:30 IST