సంక్రాంతి వచ్చింది. సరికొత్త సినిమా కబుర్లు తెచ్చింది. కొత్త లుక్కులు, పాటలు, టీజర్లతో తెలుగు చిత్రసీమలో, ప్రేక్షకుల్లో ఉల్లాసం నెలకొంది. ‘సంక్రాంతి వచ్చింది తుమ్మెదా... సరదాలు తెచ్చిందే తుమ్మెదా... చూశావా!?’ అన్నట్టు తెలుగు సినిమా నగరిలో ఎటు చూసినా సందడి నెలకొంది. ఈ ప్రచార చిత్రాల సంగతేమిటో ఓసారి చూద్దాం!