నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి 8 ఏళ్లు పూర్తి: Thulasi Reddy

ABN , First Publish Date - 2022-06-02T20:32:14+05:30 IST

రాష్ట్ర విభజన జరిగి.. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి సరిగ్గా గురువారం నాటికి 8 ఏళ్లు పూర్తి అయ్యాయని...

నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి 8 ఏళ్లు పూర్తి: Thulasi Reddy

Amaravathi: రాష్ట్ర విభజన జరిగి.. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి సరిగ్గా గురువారం నాటికి 8 ఏళ్లు పూర్తి అయ్యాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Thulasi Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ 8 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విభజన సంధర్భంగా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఐఐటి, ఎన్‌ఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు... ఇలా 25 వరాలు ఇచ్చిందన్నారు. ఈ వరాలు అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. 2014 లేక 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ వరాలన్నీ అమలై ఉండేవన్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2014, 2019లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పై వరాలు అమలుకు నోచుకోలేదన్నారు.  రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-02T20:32:14+05:30 IST