Abn logo
Sep 11 2021 @ 16:27PM

ఎంపీ బంధువంటూ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు

పశ్చిమగోదావరి: జిల్లాలోని కొయ్యలగూడెంలో కొంతమంది వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఎంపీ నందిగం సురేష్ బంధువంటూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికులు రావడం గమనించిన ఆ వ్యక్తులు పరారైయ్యారు. అయినాసరే వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.