టీ-హబ్‌, టీఎ‌ఫ్‌ఎంసీ ఒప్పందం

ABN , First Publish Date - 2021-02-28T09:10:35+05:30 IST

హైదరాబాద్‌లో స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడానికి టీ-హబ్‌, తెలంగాణ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌ఎంసీ) ఒప్పందం

టీ-హబ్‌, టీఎ‌ఫ్‌ఎంసీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడానికి టీ-హబ్‌, తెలంగాణ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీఎ‌ఫ్‌ఎంసీ సభ్యులు సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలతో స్టార్టప్‌ కంపెనీలను అనుసంధానం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని టీఎఫ్‌ఎంసీ ప్రెసిడెంట్‌ ఎం.సత్యనారాయణ తెలిపారు. కొత్త స్టార్ట్‌పలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. స్టార్ట‌ప్‌లు సరైన ఖాతాదారులను పొందడానికి మార్గదర్శనం చేస్తామన్నారు. వర్క్‌షాపుల నిర్వహణ, నెట్‌వర్క్‌ను పటిష్ట పరచుకోవడానికిసాయం చేస్తారు. 

Updated Date - 2021-02-28T09:10:35+05:30 IST