లిథువేనియన్ సైబర్ సెక్యూరిటీ నిపుణుల సూచన
విల్నియస్ (లిథువేనియా):మీ చైనీస్ ఫోన్లను విసిరేయండి అని లిథువేనియన్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించడం సంచలనం రేపింది. చైనా మొబైల్ ఫోన్లలో భద్రతా లోపాలు,సెన్సార్షిప్ సమస్యలను గుర్తించిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల వాడకాన్ని విడిచిపెట్టాలని ఆ దేశ ప్రభుత్వ సంస్థలను కోరారు. హువావే,షియోమిలు తయారు చేసిన ఫోన్లలో నాలుగు ప్రధాన సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను లిథువేనియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ కనుగొంది. వీటిలో రెండు ముందే ఇన్స్టాల్ చేసిన యాప్‌లకు సంబంధించినవని తేలింది. మరొకటి వ్యక్తిగత డేటా లీకేజీకి సంబంధించినవి.
దీంతో ఈ రెండు బ్రాండ్ల మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా హెచ్చరిక జారీ చేశారు. చైనా బ్రాండ్లకు చెందిన 4,500 ఫోన్లు ఉపయోగంలో ఉన్నాయని, ఇవి ప్రమాదాలను పెంచుతాయని, అందుకనే వీటిని పడేయాలని డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మార్గిిస్ అబూకెవిసియస్ కోరారు. బీజింగ్ ఆధారిత షియోమి విలువైన పరికరాలకు ప్రసిద్ధి చెందింది. షియోమి ఈ సంవత్సరం విక్రయాల్లో ప్రపంచంలోనే నంబర్ 2 స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. గతంలో అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్ ఈ కంపెనీ ఫోన్లను బ్లాక్ లిస్టులో చేర్చింది.