Oct 20 2020 @ 04:27AM

థ్రిల్లర్‌ ‘భూమిక’

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఇమేజ్‌ సొంతం చేసుకున్న కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూమిక’. ఐశ్వర్యా రాజేశ్‌కి 25వ చిత్రం. ఇందులో ఆమె ఫస్ట్‌ లుక్‌ను సోమవారం ట్విట్టర్‌లో తమన్నా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన సుదాన్‌ సుందరమ్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక థ్రిల్లర్‌. ఆసక్తికరమైన కథాంశంతో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేసేలా, థ్రిల్‌ ఇచ్చే సన్నివేశాలతో దర్శకుడు రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’’ అని అన్నారు. ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానమ్‌, జయరామన్‌ మరో ఇద్దరు నిర్మాతలు. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు సమర్పకులు.