పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు

ABN , First Publish Date - 2022-08-20T05:10:33+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు
తొగుటలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

 విజేతలకు బహుమతుల ప్రదానం

 ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ

 కొనసాగుతున్న వజ్రోత్సవాలు


సిద్దిపేట టౌన్‌/హుస్నాబాద్‌రూరల్‌/తొగుట/కోహెడ /మద్దూరు/గజ్వేల్‌/నంగునూరు/దౌల్తాబాద్‌/మిరుదొడ్డి/ చేర్యాల/ములుగు, ఆగస్టు 19: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.   సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అనుబంధ మెడికల్‌ కళాశాలలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పండ్లను పంపీణీ చేశారు. తొగుట మార్కెట్‌ యార్డులో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌, ఎంపీపీ లత, ఎంపీడీవో శ్రీధర్‌, సరఁంచ్‌ కొండల్‌రెడ్డి బహుమతులను అందజేశారు. కార్మక్రమంలో ఎంపీవో చందన, పంచాయతీ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు. కోహెడ మండ లంలోని తంగళ్లపల్లి లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వ హించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పాము నాగేశ్వరిశ్రీకాంత్‌, వార్డు సభ్యులు స్వరూప, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పాల్గొన్నారు. కోహెడలో జడ్పీటీసీ శ్యామల మధుసూదన్‌ ప్రభుత్వ, పైవ్రేటు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి పాల్గొన్నారు. హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ దామోదర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రాజమల్లయ్య పండ్లను పంచారు. మద్దూరులో ముగ్గుల పోటీలు నిర్వహించగా.. ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్‌ బహుమతులను అందజేశారు. రేబర్తిలో ముగ్గుల పోటీలతో పలు రకాల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ ప్రేమలత, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మాధవ్‌జాదవ్‌ పాల్గొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్సీ వంటేరి యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నంగునూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పండ్లను పంపిణీ చేశారు. దౌల్తాబాద్‌లో ప్రజాహి త ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్‌రెడ్డి మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వ హించారు. మిరుదొడ్డిలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నైపుణ్య ఆర్గనైజేషన్‌ ప్రతినిధి ఐలయ్య ఆధ్వ ర్యంలో 2కే రన్‌ను ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్‌ సత్య నారాయణ, ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ ప్రారంభించారు. మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లను పంపిణీ చేశారు. మిరుదొడ్డి దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఎక్సైజ్‌ సీఐ గాయత్రి ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో పండ్లను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, వైస్‌చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, కౌన్సిలర్లు పండ్లను పంపిణీ చేశారు.


 

Updated Date - 2022-08-20T05:10:33+05:30 IST