దుబాయ్: జింబాబ్వే క్రికెట్ జట ్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మూడున్నరేళ్ల నిషేధాన్ని విధించింది. స్పాట్‌ఫిక్సింగ్ కోసం ఓ భారత వ్యాపారవేత్త తనను సంప్రదించడంపై బ్రెండన్ ఆలస్యంగా సమాచారమిచ్చినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల బ్రెండన్ టేలర్ నిరుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.