అశ్లీల సంభాషణల వీడియోలు.. చానెల్‌ నడిపిన ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-13T17:39:18+05:30 IST

యువతులతో అశ్లీల సంభాషణలు జరిపించి

అశ్లీల సంభాషణల వీడియోలు.. చానెల్‌ నడిపిన ముగ్గురి అరెస్టు

చెన్నై : చెన్నై బిసెంట్‌నగర్‌ బీచ్‌, ఎలియట్స్‌ బీచ్‌ల వద్ద ‘చెన్నై టాక్‌’ పేరుతో యువతులతో అశ్లీల సంభాషణలు జరిపించి వాటిని వీడియో తీసి యూట్యూబ్‌ చానెల్‌లో ప్రసారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శాస్త్రినగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.  చెన్నైకి చెందిన దినేశస్‌ (31), అశిన్‌ బాద్‌షా (23), అజయ్‌బాబు (24) అనే ముగ్గురు కలిసి యూట్యూబ్‌లో చెన్నై టాక్‌ పేరుతో రెండేళ్లుగా ఓ చానెల్‌ను నడుపుతున్నారు. ఈ ముగ్గురు వీడియో కెమెరాను చేతపట్టుకుని బీచ్‌లలో సేదతీరుతున్న యువతుల వద్ద కబుర్లాడుతూ ఆ దృశ్యాలను వీడియో తీసేవారు.


ఆ సందర్భంగా కొంతమంది యువతులను రెచ్చగొట్టించి వారి చేత బూతులు మాట్లాడించేవారు. ఇలా ఆ ముగ్గురు తీసిన వీడియోలు యూట్యూబ్‌ చానెల్‌లో ప్రసారం చేసేవారు. ఆ ముగ్గురికి బీచ్‌లో వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చిన కొంతమంది యువతులు యూట్యూబ్‌లో తామ మాట్లాడని అసభ్య పదజాలంతో ప్రసారమైన వీడియోలను చూసి దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయమై ఆ యువతులు ఫిర్యాదు చేయడంతో శాస్త్రి నగర్‌ పోలీసులు రంగంలోకి దిగి సోమవారం సాయంత్రం ఎలియట్స్‌ బీచ్‌లో యువతుల వద్ద వీడియో తీస్తుండగా ముగ్గురిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-01-13T17:39:18+05:30 IST