పసివాడి ప్రాణం.. రూ. 16 కోట్లు

ABN , First Publish Date - 2021-06-12T23:12:28+05:30 IST

పసివాడి ప్రాణం.. రూ. 16 కోట్లు

పసివాడి ప్రాణం.. రూ. 16 కోట్లు

హైదరాబాద్: మూడేళ్ల బాలుడు అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారి స్థితికి బాధపడటం. బతి ఉన్నంత వరకు ప్రేమగా చూసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. అరుదైన వ్యాధితో పడుతున్న మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులకు వైద్యుడు బాధగా చెప్పిన మాట ఇది. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఆ బాలుడిని బతికించేది ఏకైక జోల్‌గెన్ స్మాఅనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఒక్క డోసు ఖరీదు అక్షరాల రూ. 16 కోట్లు. దిగుమతి సుంకం రూ.6 కోట్లు అదనం. మొత్తంగా రూ.22కోట్లు సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ దంపతులకు అది అందని ఆకాశమే. 


అయినా ఆశ కోల్పోక ఒక ప్రయత్నం చేద్దామని భావించారు. వారి ఆశకు మనసున్న దాతల మానవత్వం తోడైంది. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడి ప్రాణ దీపం ఆరిపోకుండా ఒకరితో ఒకరికి సంబంధంలేని 62 వేల మంది 400 మంది చేతులు అడ్డుకున్నాయి. అక్షరాల రూ. 14 కోట్ల 74 లక్షలు పోగేసి కవచంలా కాపాడి ప్రాణాలు నిలిపాయి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్లలో కొత్త వెలుగులు విరబూశాయి. 



Updated Date - 2021-06-12T23:12:28+05:30 IST