చీటింగ్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్ష

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

చీటింగ్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్ష

చీటింగ్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్ష

ఆదిభట్ల, జూలై 1: బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తిని మోసపూరితంగా విక్రయించిన ఇద్దరు వ్యక్తులు, మధ్యవర్థిత్వం వహించిన ఓ మహిళకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఇబ్రహీంపట్నం 15వ అడిషనల్‌  కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఎన్‌ఆర్‌ఐ కే.సత్యసాయి తన తల్లి కే.వెంకటరమణ పేరుమీద సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామంలో రెండు ప్రాపర్టీలను కొన్నాడు. కే.కల్పనపౌల్‌ అనే మహిళ ద్వారా ఎన్‌ఆర్‌ఐ తల్లి ప్లాట్లకు సంబంధించిన యాజమానులు బి.రఘువీరారెడ్డి, పి.శివాజీలతో మాట్లాడి 2009లో రిజిస్ట్రేషన్‌ చేయించింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో వర్జినల్‌ సేల్‌డీడ్‌ సర్టిఫికెట్లు పోయినట్లు చెప్పి సీసీ కాపీలతో రిజిస్ట్రేషన్‌ చేశారు. సదరు ప్రాపర్టీలు రెండూ బ్యాంకులో తనఖా పెట్టి ఉన్నట్లు గుర్తించిన ఎన్నారై సత్యసాయి తల్లి వారిని నిలదీయగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆప్పట్లో ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించగా రఘువీరారెడ్డి, శివాజీ, కల్పనలపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈమేరకు శుక్రవారం నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం 15వ అడిషనల్‌ ఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎం.రాజు తీర్పునిచ్చారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST