ఆ ఇంటి కోసం మూడేళ్లు!

ABN , First Publish Date - 2022-01-30T05:30:00+05:30 IST

విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ఖిఖీ. ముంబైలో ఆయనకు ఇంతవరకూ సొంత ఇల్లు లేదు. ..

ఆ ఇంటి కోసం మూడేళ్లు!

విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ఖిఖీ. ముంబైలో ఆయనకు ఇంతవరకూ సొంత ఇల్లు లేదు. తన గ్రామంలో ఉన్న తన పాత ఇల్లు లాంటిది ముంబైలో కట్టుకోవాలనే కోరిక చాలా కాలంగా ఉంది. అందుకే  ఒక పాత బంగ్లాను కొని , తన అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి దానికి ఓ కొత్త రూపు తీసుకురావడానికి  నవాబ్‌కు మూడేళ్లు పట్టింది. తన తండ్రి జ్ఞాపకార్థం ఈ భవంతికి ‘నవాబ్‌’ అని పేరు పెట్టారు. త్వరలోనే గృహ ప్రవేశం చేయనున్నారు నబాబ్‌.

ఇక నటుడిగా ఆయన చాలా సినిమాలే కమిట్‌ అయ్యారు. కంగనా రనౌత్‌ దర్శకత్వం వహిస్త్ను ‘టికు వెడ్స్‌ షేరు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నవాబ్‌ నటించిన ‘జోగిరా సారా రా రా’, ‘బోలే చుడియన్‌’, ‘హీరో పంటి 2’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

Updated Date - 2022-01-30T05:30:00+05:30 IST