Abn logo
Apr 11 2021 @ 01:24AM

8 నెలల తమ్ముడిపై మూడేళ్ల బాలుడి కాల్పులు

అమెరికాలోని హ్యూస్టన్‌లో విషాదం


హ్యూస్టన్‌, ఏప్రిల్‌ 10: అభంశుభం తెలియని పిల్లల చేతుల్లో ఆటవస్తువులుగా మారేస్థాయికి అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పెరిగిపోయింది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడికి తుపాకీ ఎక్కడ దొరికిందో ఏమో.. దాన్ని తీసుకొని తన తమ్ముడైన 8 నెలల శిశువును కాల్చాడు. పసివాడికి పొట్టలో తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లో వాళ్లు ఆస్పత్రికి తరలించగా అప్పటికే పసిగుడ్డు ఊపిరి వదిలేశాడు. టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లోని ఓ ఫ్లాట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 

Advertisement
Advertisement
Advertisement