ముగ్గురు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-20T06:22:18+05:30 IST

ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.5 లక్షల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు దొంగల అరెస్టు
విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

రూ.7.5లక్షల విలువ గల ఆభరణాలు స్వాధీనం

సూర్యాపేట క్రైం, ఆగస్టు 19: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.5 లక్షల వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌  ఆయన వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం తొమ్మిది గంటలకు అనుమానాస్పదంలో బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను ఆపి వారి వద్ద బ్యాగును తనిఖీ చేయగా  వెండి, బంగారు ఆభరణాలు ఉన్నారు.  పొంతన లేని సమాఽధానాలు చెప్పినందున అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి ప్రశ్నించారు.  చిలుకూరు మండల కేంద్రానికి చెందిన పాత నేరస్తుడు కిన్నెర మధు పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడన్నారు.  2018లో కోదాడ పట్టణ పోలీసులు మధుపై పీడీయాక్టు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ అతడిలో మార్పురాలేదు. అంతేకాకుండా మే 2022లో చిలుకూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దొంగతనం చేయగా పోలీసులు పట్టుకుని నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. అక్కడ జనగాం జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడుగు గ్రామానికి చెందిన తాళ్లకుమార్‌, మాటూరి సంపత్‌లు పరిచయమయ్యారు. వీరందనూ కొన్ని నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి హుజూర్‌నగర్‌, జనగాం జిల్లా కొడకండ్ల, రఘునాథపాలెం, పాలకుర్తి, జాఫర్‌ఘడ్‌, జనగాం జిల్లాల్లోని  పలు ఇళ్లల్లో చోరీలు చేశారు.  దొంగిలించిన వెండి, బంగారు ఆభరణాలను  హుజూర్‌నగర్‌లో విక్రయించేందుకు బైక్‌పై వస్తూ పోలీసులకు పట్టుబడ్డారని ఎస్పీ వివరించారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి నిందితుల నుంచి 13 తులాల ఆభరణాలు, 36 తులాల వెండి ఆభరణాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ జి. వెంకటేశ్వర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి, సిబ్బంది ఉన్నారు.




Updated Date - 2022-08-20T06:22:18+05:30 IST