Shocking : రూ. 4 లక్షలు చోరీ చేసిన Tenth విద్యార్థులు.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

ABN , First Publish Date - 2022-05-21T16:42:40+05:30 IST

రూ. 4 లక్షలు చోరీ చేసిన Tenth విద్యార్థులు.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

Shocking : రూ. 4 లక్షలు చోరీ చేసిన Tenth విద్యార్థులు.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

  • ఇంట్లో చిన్నారులకు మాయమాటలు చెప్పి..


హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు పదో తరగతి (Tenth Students) విద్యార్థులు ఓ ఇంట్లో దొంగతనం (Robbery) చేశారు. మాయ మాటలు, చాక్లెట్లు, ఇతర వస్తువులతో ఆ ఇంటి చిన్న పిల్లలను లోబరుచుకుని వారి ద్వారా కొంత, స్వయంగా వారు కొంత మొత్తం రూ. 4 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసుల (Police) కథనం ప్రకారం.. శివశంకర్‌, వరలక్ష్మి భార్యాభర్తలు (Wife And Husband). వారికి ఇద్దరు కుమారులు. ఎనిమిదేళ్లుగా ఎస్‌ఆర్‌ నాయక్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇంటి యజమాని మేనల్లుడు, మరో ఇద్దరు కూడా శివశంకర్‌, వరలక్ష్మి పిల్లలు చదువుతున్న స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు.


ఆ ముగ్గురూ గత నెలలో శివ శంకర్‌ ఇంటికి వెళ్లి ఆయన పిల్లలకు వాచీలు, చాక్లెట్లు, కొన్ని వస్తువులు కొనిచ్చారు. వారిని మాటలతో మాయ చేసి ఇంట్లోని రూ. నాలుగు లక్షలను అపహరించారు. ఓ బేకరీ యజమాని నుంచి  ఆడుకునే రూ. 500 నోట్ల కట్టను తీసుకొచ్చి శివ శంకర్‌ ఇంట్లో పెట్టారు. అక్కడ దొంగిలించిన డబ్బుతో జల్సాలు చేశారు. డబ్బు పోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దంపతులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.బాలరాజు తెలిపారు.

Updated Date - 2022-05-21T16:42:40+05:30 IST