Abn logo
Mar 3 2021 @ 17:53PM

కరోనా కాటుతో.. సౌదీలో ముగ్గురు తెలుగు ప్రవాసీయులు మృతి!

కరోనాతో సౌదీలో వైద్యుడితో పాటు మరో ఇద్దరు తెలుగు ప్రవాసీయులు మృతి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మహమ్మరి కరోనా కాటుతో సౌదీ అరేబియాలో ముగ్గురు తెలుగు ప్రవాసీయులు మృతిచెందారు. వీరిలో ఒకరు సీనియర్ డాక్టర్ ఉన్నారు. రియాధ్ నగరంలో వైద్యుడిగా పని చేస్తున్న సిద్దిపేట జిల్లా చిట్యాలకు చెందిన ఎరబెల్లి శరత్ కుమార్(71) మంగళవారం రాత్రి మరణించారు. ఫిబ్రవరి 1 నుండి ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. దీంతో ఆయన గత కొన్ని వారాలుగా మృత్యుతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. ఆయన ముగ్గురు కూతుళ్ళు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. భార్య కూడా కాలం చేశారు. ఎంతో జాగ్రత్తగా కరోనా రోగులకు వైద్యం అందించిన ఆయన చివరకు అదే వైరస్ బారినపడి చనిపోయారు.


మరో కేసులో సుమారు నెల రోజులుగా రియాధ్ నగరంలో కరోనా చికిత్స పొందుతున్న హైదరాబాద్ నగరంలోని మిస్రీగంజ్‌కు చెందిన ఖాజా సిరాజోద్దీన్ (57) కూడా ఆదివారం మృతిచెందాడు. ముందు సాధారణ జ్వరంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఖాజాకు కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మూడో కేసులో దమ్మాంలో పని చేసే మోహ్మద్ అబ్దుల్ వహీద్(51) అనే ఇంజినీర్ కూడా కరోనాతోనే మరణించాడు. సౌదీ-భారత్‌ దేశాల మధ్య విమానాలు లేకపోవడంతో దుబాయి మీదుగా వస్తున్న తన కొడుకును తీసుకోరావడానికి సౌదీ నుండి దుబాయి వెళ్లారు. ఆ సమయంలో దుబాయిలో ఆయనకు కరోనా సోకింది. దాంతో అక్కడి ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతూ వహీద్ మరణించాడు.

Advertisement
Advertisement
Advertisement