ముగ్గురు school విద్యార్థులకు కరోనా... ఆఫ్‌లైన్ తరగతుల రద్దు

ABN , First Publish Date - 2022-04-11T14:08:37+05:30 IST

ఘజియాబాద్‌ నగరంలోని వైశాలిలోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్‌లో సోమవారం ముగ్గురు విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు...

ముగ్గురు school విద్యార్థులకు కరోనా... ఆఫ్‌లైన్ తరగతుల రద్దు

ఘజియాబాద్‌(ఉత్తరప్రదేశ్): ఘజియాబాద్‌ నగరంలోని వైశాలిలోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్‌లో సోమవారం ముగ్గురు విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈలోగా తరగతులు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తామని స్కూలు తెలిపింది.స్కూల్ మేనేజ్‌మెంట్ సోమ, మంగళవారాలు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది. 




విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, అవసరమైన కొవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించాలని కూడా పాఠశాల యాజమాన్యం కోరింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై కొవిడ్ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.పాఠశాల మొత్తం క్యాంపస్, బస్సులను ప్రతిరోజూ శానిటైజేషన్ నిర్వహిస్తోంది.9-12వ తరగతి విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ఫిబ్రవరి 7న ఇప్పటికే ప్రారంభమయ్యాయి.




Updated Date - 2022-04-11T14:08:37+05:30 IST