దంతెవాడలో ప్రాణాలు కోల్పోయిన మరో జవాను
రాంచీ/దుమ్ముగూడెం, ఫిబ్రవరి 4: భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. సింగ్‌భూమ్ జిల్లా అటవీ ప్రాంత సమీపంలో ఉండే హోయాహాతు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు, ఛత్తీ్‌సగఢ్‌లోనూ మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి లక్ష్మీకాంత్ ద్వివేది అనే జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీ్‌సగఢ్ సాయుధ దళం (సీఏఎఫ్) దంతెవాడ జిల్లా గీదం పోలీసు స్టేషన్ పరిధిలోని పహర్‌నార్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.