ముగ్గురు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-13T05:05:24+05:30 IST

బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఒంటరి మహిళలను టార్గె ట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనపర్చుకున్నట్లు బోధన్‌ ఏసీపీ రామారావు తెలిపారు. శనివారం సాయంత్రం వర్నిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బురిగిడి సాయిబాబు, బురిగిడి మోహన్‌, బురిగిడి సూర్యకుమార్‌లు చెడు అలవాట్లకు బానిసై డబ్బును సులువుగా సంపాదించేందుకు అడ్డదారులను వెతుకున్నారని ఏసీపీ తెలిపారు.

ముగ్గురు దొంగల అరెస్టు

వర్ని, జూన్‌ 12: బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఒంటరి మహిళలను టార్గె ట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనపర్చుకున్నట్లు బోధన్‌ ఏసీపీ రామారావు తెలిపారు. శనివారం సాయంత్రం వర్నిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బురిగిడి సాయిబాబు, బురిగిడి మోహన్‌, బురిగిడి సూర్యకుమార్‌లు చెడు అలవాట్లకు బానిసై డబ్బును సులువుగా సంపాదించేందుకు అడ్డదారులను వెతుకున్నారని ఏసీపీ తెలిపారు. ఒంట రి మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారిని మబ్బెపెట్టి వారి మెడలో నుం చి బంగారు నగలను లాక్కెళ్లడం వీరి పని అని తెలిపారు. వర్ని మండ లంలోని సత్యనారాయణపురం, చందూరు, వర్నిలోని కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం, రుద్రూరులోని హనుమాన్‌, వీరభద్రస్వామి ఆలయాల లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరి వద్ద నుంచి 16తులాల బంగారం, 600 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. సమావేశంలో రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి, ఏఎస్సై బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:05:24+05:30 IST