నెలరోజుల్లో ముగ్గురు సస్పెండ్‌.. అసలేం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2021-03-07T14:02:25+05:30 IST

నెలరోజులలోపే కాచిగూడ రైల్వే పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో

నెలరోజుల్లో ముగ్గురు సస్పెండ్‌.. అసలేం జరుగుతోంది..!?

హైదరాబాద్/బర్కత్‌పుర : నెలరోజులలోపే కాచిగూడ రైల్వే పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ముగ్గురు సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, పట్టాలు దాటుతూ రైలు ప్రమాదానికి గురయ్యాడని తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. గత నెలలో కూడా ఓ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. గత నెల 16న రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి టికెట్‌ లేకున్నా, టికెట్‌ ఉన్నట్లు తప్పుడు రిపోర్టు ఇచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ నిరంజన్‌నాయక్‌ను రైల్వే ఎస్పీ సస్పెండ్‌ చేశారు. 


విద్యానగర్‌ సమీపంలో 2018లో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, రైలు ప్రమాద ఘటనగా కేసు నమోదుచేసిన ఎస్‌ఐ సంగమేశ్వర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ లాలియానాయక్‌లను రైల్వే రహదారి భద్రత అదనపు డీజీపీ సందీప్‌ శాండిల్య శుక్రవారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆత్మహత్యను రైలు ప్రమాదఘటనగా కేసు నమోదు చేసిన తీరును రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌  కోర్టు విచారణలో తప్పుపట్టింది. అందుకు బాధ్యులైన వారిని  అదనపు డీ జీపీ సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-03-07T14:02:25+05:30 IST