హైదరాబాద్ సిటీ/బేగంపేట : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంట్రీక్లబ్ ఆవరణలో నడుస్తున్న మూడు పబ్‌లను పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోని కంట్రీక్లబ్ ఆవరణలో ఉన్న పబ్‌లైన్ క్లబ్ టాలీవుడ్, హైఫై, పర్పుల్ పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు, కలెక్టర్‌కు స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పబ్‌ల నిర్వాహకుడు మురళిపై కూడా పంజాగుట్ట పోలీసులు పలు కేసులను ఇప్పటికే నమోదు చేశారు. అయినా కూడా నిర్వాహకుడు తీరు మార్చుకోకుండా పబ్‌లను నడపడంతో స్థానికులు ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి, రెవెన్యూ అధికారులతో కలిసి మూడు పబ్‌లను సీజ్ చేశారు.