Abn logo
Feb 19 2020 @ 23:18PM

చాలా మంది ట్రోల్స్ చేశారు కానీ.. వాళ్లకు తెలీని విషయం ఏంటంటే..

మూడు చిత్రాలు ఒకేసారి చేయను!


‘‘ప్రేమలో పడక ముందు, పడిన తర్వాత... నేను ఒకేలా ఉన్నాను. నాలో మార్పులేం లేవు!’’ అని నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల! నితిన్‌ చెప్పిన ముచ్చట్లు...


‘భీష్మ’లో మీమ్స్‌ చేసే యువకుడిగా కనిపిస్తా. పాత్ర సరదాగా ఉంటుంది. సినిమా కూడా వినోదాత్మకమే. ఇటీవల విడుదలైన ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ గురించి చెప్పాం. ఆ విషయం ముందే చెప్తే సీరియస్‌ సినిమా అనుకుంటారని ట్రైలర్‌ వరకూ దాచాం. ‘అతడు’లో ఫైట్‌ స్ఫూర్తితో సెకండాఫ్‌లో పొలంలో ఫైట్‌ డిజైన్‌ చేశాం. చాలా బాగా వచ్చింది. త్రివిక్రమ్‌గారికి నచ్చింది. ప్రేక్షకులకూ నచ్చుతుంది.


ట్రైలర్‌లో పవన్‌కల్యాణ్‌గారి ‘ఖుషి’లో టెంపుల్‌ సీన్‌ను గుర్తుచేసే సీన్‌ ఒకటి ఉంది. చాలామంది దానిపై ట్రోల్స్‌ చేశారు. పబ్లిసిటీకి పవన్‌గారిని వాడుకుంటున్నానని! వాళ్లకు తెలియనిది ఏంటంటే... నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుండి, ఆఖరికి ఫ్లాప్‌ చిత్రాల్లోనూ ఎక్కడో ఒక చోట పవర్‌స్టార్‌ ప్రస్తావన లేదా ఆయన పోస్టర్‌ ఉంటుంది. ఆయనపై నాకున్న స్వచ్ఛమైన ప్రేమ అది. ప్యూర్‌ లవ్‌!


రెండు మూడు ఫ్లాప్స్‌ రావడంతో కథపై రాజీ పడకూడదనీ, నాకు నచ్చేవరకూ చిత్రీకరణ ప్రారంభించకూడదనీ నిర్ణయించకున్నా. అందుకని, ఆలస్యమైంది. ‘అ... ఆ’లో కొన్ని సన్నివేశాలపై గురూజీ త్రివిక్రమ్‌తోనూ వాదించా. అలా చేస్తే... ప్రతిదీ హిట్‌ అవుతుందనే గ్యారెంటీ లేదు. కానీ, ఎట్‌ లీస్ట్‌... నాకు నచ్చిన సినిమా చేశాననే సంతృప్తి ఉంటుంది కదా!


ఏడాది గ్యాప్‌ రావడంతో మూడు కథలు విన్నా. కొంత వ్యవధిలో మూడు సినిమా షూటింగులు స్టార్ట్‌ అయ్యాయి. చంద్రశేఖర్‌ ఏలేటిగారు కళ్లు బ్లింక్‌ చేయమనేవారు. ‘భీష్మ’ సెట్‌లో వెంకీ కుడుముల అలా వద్దనేవాడు. ‘రంగ్‌ దే’ సెట్‌లో వెంకీ అట్లూరిది మరో స్టైల్‌. క్యారెక్టర్స్‌ మధ్య షిఫ్ట్‌ కావడానికి టైమ్‌ పట్టింది. కన్‌ఫ్యూజ్‌ అయ్యేవాణ్ణి. కానీ, దర్శకులకు క్లారిటీ ఉండడంతో వాళ్లను ఫాలో అయ్యా. మళ్లీ మూడు సినిమాలు ఒకేసారి చేయను.

దుబాయ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాది కాదు. మా ఇద్దరి ఫ్యామిలీలది. రీసెంట్‌గా ఇంట్లో ‘పసుపు కుంకుమ’ ఫంక్షన్‌ జరిగింది. అప్పుడు ఎంతసేపు అనిపించింది. ఒక విధంగా ‘శ్రీనివాస కల్యాణం’ నా పెళ్లికి రిహార్సల్స్‌ వంటిది. నా పెళ్లి వార్త బయటకు రాగానే నాని ‘వెల్కమ్‌ టు క్లబ్‌. వికెట్‌ డౌన్‌’ అని విష్‌ చేశాడు. వరుణ్‌తేజ్‌ ఫోన్‌ చేసి ‘నువ్వు చేసుకుంటున్నావ్‌! మా ఇంట్లో ప్రెజర్‌ చేస్తున్నారు’ అన్నాడు. ఇంకా చాలామంది చాలా రకాలుగా విష్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement