Advertisement
Advertisement
Abn logo
Advertisement

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి!

నార్త్ కరోలినా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌లో శనివారం ఓ ఇంట్లో జరిగిన పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 16 ఏళ్ల బాలిక ఉన్నట్లు విల్మింగ్టన్ పోలీసు వాచ్ కమాండర్ లెఫ్టినెంట్ ఇర్వింగ్ తెలియజేశారు. ఇక చనిపోయిన ముగ్గురిలో బాలిక వివరాలను వెల్లడించని పోలీసులు మిగత ఇద్దరిని జియా వాడే(22), షమీర్ జోన్స్(21)గా గుర్తించారు. గాయపడ్డ  జైకేరియా క్రాఫోర్డ్(19), వాలెరీ ఒరెలస్(18), జిమిరియన్ అట్కిన్స్(18), కీష్వాన్ జేమ్స్(21)ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు చెప్పిన సమాచారం ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీస్ అధికారి ఇర్వింగ్ పేర్కొన్నారు.     

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement