Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమెరికాలో దారుణం.. ఇద్దరు మహిళలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

twitter-iconwatsapp-iconfb-icon
అమెరికాలో దారుణం.. ఇద్దరు మహిళలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

ఎన్నారై డెస్క్: అమెరికాలో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. గురువారం ఓ వ్యక్తి ఇద్దరు మహిళలను తుపాకీతో కాల్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐయోవా రాష్ట్రంలోని ఏమ్స్ నగరంలోని ఓ చర్చ్‌ పక్కనున్న పార్కింగ్ స్థలంలో ఈ దారుణం జరిగింది. గన్‌ వైలెన్స్‌పై అమరికా అధ్యక్షుడు బైడెన్ మరో రాష్ట్రంలో ప్రసంగించిన సందర్భంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికే ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. మరోవైపు.. విస్కాన్సిన్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఇటీవల కాలంలో అమెరికాలో పలుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుపాకీ సంస్కృతిని ఎలా నియత్రించాలనే దానిపై అక్కడి ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.