కూలిన బతుకులు

ABN , First Publish Date - 2020-05-23T10:26:40+05:30 IST

వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చో టుచేసుకుంది.

కూలిన బతుకులు

తగిలేపల్లిలో విషాదం 

అద్దె ఇంటి గోడకూలి భార్య, భర్త, కుమారుడి దుర్మరణం

మరో ముగ్గురు కూతుర్లకు గాయాలు


పేదరికం  ఆ కుటుంబం పాలిట మృత్యుపాశమైంది.. ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. ఇంటి గోడ రూపంలో మృత్యువు వారి ప్రాణాలను కబళించింది. భార్య, భర్త, ఏడాది వయసున్న కుమారుడు ఇంటి గోడ కూలి నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు. మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. మృత్యువు అంచునుంచి బయటపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు పేదరికం వెక్కిరింపు, మరోవైపు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల రాజకీయం మూడు అమాయక పేద ప్రాణాలను బలిగొనగా మరో ముగ్గురిని చావు అంచువద్దకు తీసుకెళ్లి అనాథలుగా వదిలిపెట్టింది. 


వర్ని, బోధన్‌, మే 22 : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చో టుచేసుకుంది. ఉదయం 6గంటల ప్రాంతంలో ప్రహరీ కూలి గ్రామానికి చెందిన మానిగిరి లక్ష్మీ(28), ఆమె కు మారుడు సాయికుమార్‌(1) అక్కడికక్కడే మృతి చెంద గా తీవ్ర గాయాలైన లక్షీ భర్త శ్రీనివాస్‌ (34)ను జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి మరో ముగ్గురు కూ తుర్లు సంజన(8), అశ్విని(6), స్నిగ్ధ (పండు)(3)కు గా యాలయ్యాయి. వారిని బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో స్నిగ్ధ వెన్నుపూ స విరగడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. 


పదేళ్ల క్రితం లక్ష్మీ, శ్రీనివాస్‌ల ప్రేమవివాహం..

తగిలేపల్లికి చెందిన లక్ష్మీ పదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్‌కు చెందిన శ్రీనివాస్‌ ను ప్రేమించి వివాహం చేసుకుంది. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న ఈ పేద దంపతులు వివాహం అనంతరం లక్ష్మీ తల్లి గంగామని చెంతకు చేరి నలుగు రు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగి స్తున్నారు. రోజూ అద్దె ఇంటి దాబాపై నిద్రించే కుటుం బంలోని ఏడుగురు శుక్రవారం అమావాస్య కావడంతో తొందరగా నిద్రలేవాలని భావించి దాబా కింది భాగం లోని వరండాలో నిర్మించిన పాత ప్రహరీ పక్కన నిద్ర పోయారు. ఉదయం 5:30 గంటలకే నిద్రలేచిన లక్ష్మీ తల్లి గంగామని ఇంటి ఆవరణలో కళ్లాపి చల్లుతుండగా  రెండో కుమార్తె అశ్విని నిద్రలేచి అమ్మమ్మతో ఆడుకుం టోంది. అప్పటికి మిగతా ఐదుగురు నిద్రలో ఉండగా 6గంటల ప్రాంతంలో ప్రహరీ కూలి వారిమీద పడి ప్ర మాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు అనిల్‌రెడ్డి, మశ్చ్యేందర్‌, రవీందర్‌లు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృ తదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 


 చనుపాలే ప్రాణం తీశాయి..

అమావాస్య కావడంతో తెల్లవారు జామునే 5.30  ప్రాంతంలోనే నిద్రలేచిన లక్ష్మీ ఇంటి పనుల్లో నిమగ్నం కాగా ఏడాది వయసున్న బాలుడు చనుపాల కోసం ఏడ్వడంతో తిరిగి లక్ష్మీ వెళ్లి బాలుడికి పాలిస్తూ నిద్రకు ఉపక్రమించింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా గోడ కూలడంతో నిద్రలోనే తల్లిబిడ్డలు ప్రాణాలు వదిలారు. 


డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చి ఉంటే..

రెక్కాడితే గాని డొక్కాడని లక్ష్మీ, శ్రీనివాస్‌ దంపతు లు ఆరేళ్లుగా గ్రామంలో నలుగురు పిల్లలు, వృద్ధురాలు గంగామనితో జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామంలో ని ర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పంపకంలో నేతల చేతి వాటం కారణంగా ఈ నిరుపేద కుటుంబానికి ఇల్లు దక్కలేదు. ఇల్లు ఇవ్వాలంటూ పెద్దల కాళ్లావేళ్ల పడ్డా ఏ ఒక్కరు కరుణించలేదు. చివరకు వారికి అద్దె ఇల్లే దిక్క యింది. నాయకులు స్పందించి ఇల్లు కేటాయించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు ఆడ కూతుళ్ల భవిష్యత్తు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


ఆర్డీవో, పోలీసుల నిలదీత

గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో సర్పం చ్‌, అతని అను చరులు భారీగా మామూళ్లు దం డుకు న్నారని ఘ టనా స్థలంలో స్థాని కులు ఆందోళనకు దిగా రు. గోడ కూలి మృతిచెందిన దంప తులకు ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి బయటకు గెంటేశారని, డబ్బులిచ్చిన అనర్హులకు ఇళ్లను కేటాయించి పేద కుటు ంబం ఉసురు తీశారని ఆర్డీవో గోపిరాం, పోలీసులను స్థానికులు నిలదీశారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల్లో చోటా, మోటా నాయకుల జోక్యం పెరిగి పేదల ఉసురు తీస్తోందని వాపోయారు. తక్షణమే బాధిత కుటుంబా నికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


బాధితులకు భరోసా ఇచ్చిన స్పీకర్‌ 

గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మృతుల పిల్లలకు భరోసా కల్పి స్తామని, మృతిచెందిన దంపతులకు రూ.4లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా, పిల్లలకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, ఇల్లు కల్పిస్తామని ఫోన్‌ ద్వారా హామీ ఇచ్చారు. కలెక్టర్‌చే విచారణ చేయించిన్యాయం చేస్తా మన్నారు.  


అనర్హులుంటే చర్యలు: ఆర్డీవో

తగిలేపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపకంలో అనర్హులుంటే విచారణ జరిపి చర్యలు చేప డతా మని బోధన్‌ ఆర్డీ వో గోపిరాం స్పష్టం చేశారు. శుక్రవా రం గోడకూలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆ ర్డీవోకు ఎంపీటీసీ బక్క నారాయణ, స్థానిక దళితులు ఫి ర్యాదు చేశారు. తహసీల్దా ర్‌, వీఆర్వో పనితీరుపై ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. దీంతో ఆర్డీవో అనర్హుల పేర్లను తొలగించి పేదలకు న్యా యం చేస్తామన్నారు.


కేసు నమోదు చేశాం : సీపీ కార్తికేయ

తగిలేపల్లి ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఆయన చిన్నారులను పరామర్శించారు. ఘటన దురదృష్టకరమని, భార్య, భర్త, యేడాది వయసున్న బాలుడు మృతిచెందడం బాధాకరమన్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. అయితే, ప్రస్తుతం ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేశామని, కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్‌రెడ్డి, సీఐ రాకేష్‌గౌడ్‌ ఉన్నారు.  

Updated Date - 2020-05-23T10:26:40+05:30 IST