జిల్లాలో మరో మూడు కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-28T10:47:53+05:30 IST

కరోనా మళ్లీ హైరానా పెడు తోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి తిరిగి ఉధృతమైంది. మంగళవారం రాత్రి ఒక కేసు నమోదు కాగా

జిల్లాలో మరో మూడు కొవిడ్‌ కేసులు

  • రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు
  • ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికే  వైరస్‌ 
  • వెంటాడుతున్న  భయం


ఒంగోలు నగరం, మే 27: కరోనా మళ్లీ హైరానా పెడు తోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి తిరిగి ఉధృతమైంది. మంగళవారం రాత్రి ఒక కేసు నమోదు కాగా బుధవారం మరో మూడు కేసులు వెలుగు చూశాయి. ఇతర ప్రాంతాల నుంచి తిరిగి స్వస్థలాలకు చేరిన వారికే పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం, వైద్యారోగ్యశాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చి న వారికి ముందుగా ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే వీఆర్‌డీఎల్‌ చేసి కరోనాగా నిర్ధారిస్తున్నారు. చీమకుర్తి మండలం రాజుపాలెంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి విజయవాడ నుంచి రాగా, సంతమాగులూరు, కొరిశపాడు మండలం కనగాలవారిపాలెంలో పాజిటివ్‌గా నిర్ధారణ అ యిన వారు చెన్న్తె నుంచి జిల్లాలోకి అడుగుపెట్టారు. ఇప్ప టికే కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చిన పలువురికి వైర స్‌ ఉన్నట్లు నిర్ధారణ కాగా తాజాగా చెన్నై నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వీరికి వైద్యసిబ్బంది ట్రూనాట్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావటంతో వీరికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


74కు చేరిన కేసులు

ఇప్పటివరకు జిల్లాలో 71గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసు ల సంఖ్య 74కి చేరింది. బాపట్లకు చెందిన మహిళకు మన జిల్లాలో పరీక్ష చేయగా పాజిటివ్‌ రాగా ఆమెను చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ కేసును మన జిల్లా  సంఖ్యలో చేర్చలేదు. కాగా మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు, సంతమాగులూరు, చీమకుర్తి మండలం రాజు పాలెం, కొరిశపాడు మండలం కనగలవారిపాలెంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఇప్పటికే ఒంగోలులోని ట్రి పుల్‌ ఐటీ కొవిడ్‌ సెంటర్‌లో ఉన్నారు. వీరికి రెండురోజుల క్రితం ట్రూనాట్‌పై చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలటంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. వీఆర్‌డీఎల్‌పై నిర్ధారణ కావటంతో రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.   వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా వైద్యసిబ్బంది బుధవారం క్వారంటైన్‌కు తరలించారు. 


జిల్లాకు గత వారంరోజులుగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో మళ్లీ కేసులు విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ట్రూనాట్‌పై  పరీక్షలు చేస్తుంటే ఒకటి రెండు కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. ట్రూనాట్‌పై బుధవారం కొ త్తపట్నం మండలం రాజుపాలెం పట్టపుపాలెం, మడనూరు పట్టపుపాలెం, దర్శిలో పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-05-28T10:47:53+05:30 IST