కదిరిలో మరో మూడు కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-05-26T10:16:34+05:30 IST

పట్టణంలోని బేరిపల్లి కాలనీలో గతంలో ఒక కరోనా కేసు నమోదు కాగా, అదే కుటుంబానికి చెందిన ముగ్గురిలో వైరస్‌ లక్షణాలున్నట్లు ..

కదిరిలో మరో మూడు కరోనా కేసులు!

కదిరి, మే 25: పట్టణంలోని బేరిపల్లి కాలనీలో గతంలో ఒక కరోనా కేసు నమోదు కాగా, అదే కుటుంబానికి చెందిన ముగ్గురిలో వైరస్‌ లక్షణాలున్నట్లు సమాచారం. వీరందరినీ గతంలోనే కోవిడ్‌ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్‌ మారుతి తెలిపారు. వారితో ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న అందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని తెలియజేశారు. పాజిటివ్‌ కేసులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2020-05-26T10:16:34+05:30 IST