గాంధీ ఫ్యామిలీలోని ఆ ముగ్గురికి క్వారంటైనే సరి: బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2020-05-26T01:55:24+05:30 IST

గాంధీ-నెహ్రూ కుటుంబీకులపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ విమర్శలు గుప్పించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా గాంధీ, నెహ్రూ కుటుంబానికి ..

గాంధీ ఫ్యామిలీలోని ఆ ముగ్గురికి క్వారంటైనే సరి: బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: గాంధీ-నెహ్రూ కుటుంబీకులపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ విమర్శలు గుప్పించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన ఆ ముగ్గురిని క్వారంటై‌న్‌లో ఉంచాలని అన్నారు. కరోనాపై పోరాటం జరుపుతున్న తరుణంలో ప్రజలను వారు భయాందోళనకు గురిచేస్తున్నారని, కరోనా మమమ్మారికి చరమగీతం పాడేంతవరకూ ఆ ముగ్గురిని క్వారంటైన్‌లోనే ఉంచాలని అన్నారు.


'ఎమర్జెన్సీ తరహా ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా బాధపడుతూనే ఉన్నారు. కానీ 50 ఏళ్ల పాటు పాలించిన ఈ కుటుంబం మాత్రం దేశంలో భయాందోళనలు  సృష్టించాలని అనుకుంటోంది. ప్రజలను బెంబేలెత్తించేలా చేస్తోంది. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. కరోనా బెడద పూర్తిగా తొలగేంత వరకూ ఆ ముగ్గురిని క్వారంటైన్‌లోనే ఉంచాలి' అని పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైనా పర్వేష్ వర్మ విమర్శలు గుప్పించారు. కోవిడ్ పేషెంట్ల కోసం 3,000 పడకలు ఏర్పాటు చేసినట్టు గత వారం ఢిల్లీ ప్రభుత్వ  ప్రతినిధి కోర్టులో అఫిడవిట్ సమర్పించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి 30,000 పడకలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారని అన్నారు. ఏది చెప్పినా ఢిల్లీ ప్రజలు నమ్ముతారని కేజ్రీవాల్ అనుకుంటున్నారని పర్వేష్ వర్మ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-26T01:55:24+05:30 IST