అసోం,మణిపూర్,మేఘాలయాల్లో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2021-06-18T12:44:40+05:30 IST

ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది ...

అసోం,మణిపూర్,మేఘాలయాల్లో భూప్రకంపనలు

తేజ్‌పూర్ (అసోం): ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అసోం, మణిపూర్, మేఘాలయ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు భూమి కంపించింది. అసోం రాష్ట్రంలోని తేజ్ పూర్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. తేజ్ పూర్ పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు భూకంపం వచ్చింది. 22 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. మణిపూర్ లోని మోయిరాంగ్ ప్రాంంతో ఒంటిగంటకు భూమి  కంపించింది. మణిపూర్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0 రికార్డు అయింది. మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదైంది. అసోం, మణిపూర్, మేఘాలయ ప్రాంతాల్లో ఒకేరోజు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. 


Updated Date - 2021-06-18T12:44:40+05:30 IST