కరోనాతో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2020-10-24T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం కరోనాతో రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి చెందారు

కరోనాతో ముగ్గురు మృతి

ఆంధ్రజ్యోతి, (రంగారెడ్డి అర్బన్‌ ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం కరోనాతో రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మూడు జిల్లాల్లో మృతి చెందిన వారి సంఖ్య 298కి చేరుకుంది. 


ఉమ్మడి జిల్లాలో 471 పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 471 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 220 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లాలో 193 నమోదయ్యాయి. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 16 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 93,743కి చేరుకుంది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో నలుగురికి పాజిటివ్‌

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో శనివారం 143 మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఒకరు, కొత్తూర్‌ మండలానికి చెందిన ఇద్దరు, కొందుర్గు మండలానికి చెందిన ఒకరు ఉన్నట్లు వివరించారు.


చేవెళ్ల డివిజన్‌లో రెండు కేసులు

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 103 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో ఒకరికి,  షాబాద్‌ మండలంలో ఒకరికి  పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఎనిమిది పాజిటివ్‌లు..

ఇబ్రహీంపట్నం: పట్నం డివిజన్‌లోని పది కేంద్రాల్లో 156 మందికి కరోనా యాంటీజెన్‌ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. దండుమైలారంలో ఒకరికి, అబ్దుల్లాపూర్‌మెట్‌ 4, రాగన్నగూడలో 2, హయత్‌నగర్‌ ఒకరికి పాజిటివ్‌గా తేలింది.


శంషాబాద్‌లో ఒకరికి..

శంషాబాద్‌ : శంషాబాద్‌లో శనివారం ఒక కరోనా పాజిటివ్‌  కేసు నమోదైంది. 30 మందికి పరీక్షలు చేసినట్టు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు.

Updated Date - 2020-10-24T05:30:00+05:30 IST