Gwalior: జెండా ఏర్పాటు చేస్తుండగా క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-14T18:08:03+05:30 IST

పోస్ట్ ఆఫీసు భవనంపై జాతీయజెండాను ఏర్పాటు చేస్తుండగా క్రేన్ విరిగిపడి ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు మరణించిన దుర్ఘటన...

Gwalior: జెండా ఏర్పాటు చేస్తుండగా క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం

గ్వాలియర్: పోస్ట్ ఆఫీసు భవనంపై జాతీయజెండాను ఏర్పాటు చేస్తుండగా క్రేన్ విరిగిపడి ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు మరణించిన దుర్ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో శనివారం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీలో కూర్చుని కార్మికులు పోస్ట్ ఆఫీస్ భవనంపై జెండాను ఉంచడానికి ప్రయత్నించినపుడు క్రేన్ ప్లాట్ ఫాం విరిగిపడింది. దీంతో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. ఈ దుర్ఘటనలో క్రేన్ నడుపుతున్న డ్రైవరు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మున్సిపల్ కార్మికుల మృతిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టరులో సంతాపం తెలిపారు.


‘‘గ్వాలియర్‌లోని మహారాజ్ బడా పోస్ట్ ఆఫీస్ వద్ద క్రేన్ తో జాతీయ జెండా ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మరణించడం మరో ముగ్గురు గాయపడిన విచారకరమైన వార్త అందింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అని సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కోరారు.


Updated Date - 2021-08-14T18:08:03+05:30 IST