Abn logo
Feb 25 2020 @ 14:20PM

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు దుర్మరణం

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను దివ్య ఆవుల, రాజా గవిని, ప్రేమ్‌నాథ్ రామనాథంగా గుర్తించారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణం ఎఫ్ఎం 423పై డెల్ వెబ్ బౌలే‌వార్డ్ జంక్షన్ వద్ద భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ప్రవాస భారతీయులు ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ముగ్గురు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఫ్రిస్కో పోలీసులు గుర్తించారు. కాగా, మృతులు ముగ్గురు కూడా ఫ్రిస్కో పట్టణంలోనే నివసిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement