ముగ్గురు భారతీయ సోదరులను దోషులుగా తేల్చిన బ్రిటన్ కోర్టు!

ABN , First Publish Date - 2021-03-16T18:04:18+05:30 IST

2019 సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగిన 22 ఏళ్ల వ్యక్తి హత్య కేసులో ముగ్గురు భారతీయ సోదరులను తాజాగా బ్రిటన్ కోర్టు దోషులుగా తేల్చింది.

ముగ్గురు భారతీయ సోదరులను దోషులుగా తేల్చిన బ్రిటన్ కోర్టు!

లండన్: 2019 సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగిన 22 ఏళ్ల వ్యక్తి హత్య కేసులో ముగ్గురు భారతీయ సోదరులను తాజాగా బ్రిటన్ కోర్టు దోషులుగా తేల్చింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కమల్ సోహల్ (23), సుఖ్మీందర్ సోహల్ (25), మైఖేల్ సోహల్ (28) అనే ముగ్గురు అన్నదమ్ముళ్లతో పాటు మరో ఇద్దరు ఆక్టాన్‌లోని ఓస్వాల్డో డి కార్వాల్హో ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. 2019 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఈ కేసు దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో న్యాయస్థానం భారతీయ సోదరులను దోషులుగా తేల్చింది. అయితే, మిగతా ఇద్దరు విచారణలో ఉండడంతో తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం అంటోయిన్ జార్జ్(24), కరీం అజాబ్(25) అనే మిగిలిన ఇద్దరిని విచారించిన న్యాయస్థానం.. జార్జ్‌ను దోషిగా, కరీంను నిర్ధోషిగా తేల్చింది. దీంతో ముగ్గురు భారతీయ సోదరులతో పాటు జార్జ్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. కాగా, ఈ నలుగురికి శిక్షను ఖరారు చేయాల్సి ఉంది.    

Updated Date - 2021-03-16T18:04:18+05:30 IST