మూడు గంటల్లో 186 టన్నుల చెత్త తొలగింపు

ABN , First Publish Date - 2022-05-29T16:34:16+05:30 IST

రాణిపేట జిల్లాలో శనివారం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో మూడు గంటల్లో 186.914 మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగించి ఎలైట్‌ ప్రపంచ రికార్డు సాధించారు. జిల్లా

మూడు గంటల్లో 186 టన్నుల చెత్త తొలగింపు

                      - రాణిపేట జిల్లా యంత్రాంగం ప్రపంచ సాధన


వేలూరు(చెన్నై): రాణిపేట జిల్లాలో శనివారం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో మూడు గంటల్లో 186.914 మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగించి ఎలైట్‌ ప్రపంచ రికార్డు సాధించారు. జిల్లా కలెక్టర్‌ భాస్కర పాండ్యన్‌ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఏసియన్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ అకాడమీ, ఇండియా రికార్డ్‌ అకాడమీ, తమిళన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ తదితరాల్లో కూడా నమోదైంది. ఇందుకుగాను ఆయా సంస్థలు కలెక్టర్‌కు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కుమరేశ్వన్‌, రూరల్‌ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ లోకనాయకి, ఎలైట్‌ రికార్డ్స్‌ ప్రపంచ సాధన సంస్థ సీనియర్‌ అధికారి అమీత్‌ హింగరేణి, ఏసియన్‌ రికార్డ్స్‌ అకాడమీ సంస్థ అంబాసిడర్‌ డా.సెంథిల్‌కుమార్‌, అకాడమీ సంస్థ అసోసియేట్‌ ఎడిటర్‌ జగన్నాథన్‌, తమిళనాడు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ప్రధాన మేనేజర్‌ బాలసుబ్రమణ్యం, ఆర్కాడు ఎమ్మెల్యే ఈశ్వరప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T16:34:16+05:30 IST