హిమాచల్ ప్రదేశ్‌లో భారీ snowfall...ముగ్గురు ట్రెక్కర్ల మృతి

ABN , First Publish Date - 2021-10-25T12:53:01+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ హిమపాతం వల్ల ముగ్గురు ట్రెక్కర్లు దుర్మరణం పాలయ్యారు...

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ snowfall...ముగ్గురు ట్రెక్కర్ల మృతి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ హిమపాతం వల్ల ముగ్గురు ట్రెక్కర్లు దుర్మరణం పాలయ్యారు. సిమ్లాలోని రోహ్రులోని జంగ్లిఖ్ నుంచి సాంగ్లా, కిన్నౌర్ కు 13 మంది బృందం ట్రెక్కింగుకు బయలుదేరింది. సముద్ర మట్టానికి 4,696 మీటర్ల ఎత్తులో ట్రెక్కర్ల బృందం బురాన్ పాస్‌కు చేరుకోగలిగింది. కానీ ఈ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్నందున ట్రెక్కర్లు ముందుకు దాటి వెళ్లలేకపోయారు. భారీగా మంచు కురవడంతో ముగ్గురు ట్రెక్కర్లు మరణించారని, వారి మృతదేహాలను నాలుగు అడుగుల మంచు కింద ఖననం చేశామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగన్ చెప్పారు. 


బురాన్ పాస్ వద్ద మంచు మధ్య 10 మంది ట్రెక్కర్లు చిక్కుకున్నారని అందిన సమాచారంతో ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది వారిని రక్షించగలిగారు. సురక్షితంగా బయటపడిన వారిలో 9 మంది ముంబైకు చెందిన వారు, ఒకరు న్యూఢిల్లీ వ్యక్తి ఉన్నారని అధికారులు చెప్పారు. మరో సంఘటనలో ఉత్తరకాశీలోని హర్సిల్ నుంచి కిన్నౌర్‌కు బయలుదేరిన ఇద్దరు హైకర్లు లంఖగా, కిన్నౌర్ ల నుంచి తప్పిపోయినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ హిమపాతం వల్ల ఏడుగురు మరణించారు.ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు ఆదివారం బయలుదేరలేక పోయాయి.  తప్పిపోయిన ట్రెక్కర్ల కోసం శోధించడానికి సోమవారం ఆపరేషన్ ప్రారంభించారు.

Updated Date - 2021-10-25T12:53:01+05:30 IST