రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటున్న స్నేహితులు.. రైలు రావడం చూసి కన్ఫ్యూజన్.. చివరకు..

ABN , First Publish Date - 2022-10-03T22:40:06+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు స్నేహితులు రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటుండగా ఒక రైలు వచ్చింది.

రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటున్న స్నేహితులు.. రైలు రావడం చూసి కన్ఫ్యూజన్.. చివరకు..

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు స్నేహితులు రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటుండగా ఒక రైలు వచ్చింది. అయితే ఆ రైలు తాము కూర్చున్న పట్టాల వైపు రాదనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ రైలు వారిపై నుంచి దూసుకెళ్లిపోయింది. ఇద్దరి తలలు శరీరాల నుంచి వేరు అయిపోయాయి. మూడో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మోతీనగర్‌లో బమోరి రైల్వే గేట్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

Delhi: ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన దుండగులు.. వారు ఆ హత్య ఎందుకు చేశారో తెలిస్తే షాకవడం ఖాయం!


ధర్మేంద్ర యాదవ్ (26), సంజు ఘోషి (30), పప్పు యాదవ్ (28)లు బమోరి రైల్వే గేట్ సమీపంలోని మూడో లైన్ ట్రాక్‌పై పడుక్కుని మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఆ ట్రాక్‌పై చాలా అరుదుగా మాత్రమే రైళ్లు వస్తాయి. దీంతో వారు ధీమాగా పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో ఒక రైలు వస్తోంది. ఆ ముగ్గురూ రైలు రావడం చూశారు. అయితే తాము ఉన్న లైన్‌లో రైలు రాదని భావించి ట్రాక్‌పై నుంచి లేవలేదు. అయితే రైలు వారి వైపు వేగంగా దూసుకెళ్లింది. క్షణంలో వారి పై నుంచి వెళ్లిపోయింది. దీంతో ధర్మేంద్ర, సంజు తలలు తెగిపడ్డాయి. పప్పు యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.



అరుపులు కేకలు విని చుట్టుపక్కల వారు, గేట్‌మ్యాన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన పప్పు యాదవ్‌కు వైద్యులు చికిత్స అందించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో పప్పు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని మోతీనగర్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-10-03T22:40:06+05:30 IST