Viral Video: కొత్తగా కొన్న ఏటీఏం మెషీన్‌ను ఓపెన్ చేసి చూసిన ముగ్గురు స్నేహితులకు షాకింగ్ సర్‌ప్రైజ్.. అందులో..

ABN , First Publish Date - 2021-10-06T21:49:25+05:30 IST

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు.. ఎలా వరిస్తుందో అస్సలు చెప్పలేం. అయితే తాజాగా ఈ అదృష్టం ఓ ముగ్గురి స్నేహితులను వరించింది. దీంతో వారి పెట్టిన ఖర్చుకు సుమారు ఏడింతల డబ్బును అధి

Viral Video: కొత్తగా కొన్న ఏటీఏం మెషీన్‌ను ఓపెన్ చేసి చూసిన ముగ్గురు స్నేహితులకు షాకింగ్ సర్‌ప్రైజ్.. అందులో..

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎవరిని.. ఎప్పుడు.. ఎలా వరిస్తుందో అస్సలు చెప్పలేం. అయితే తాజాగా ఈ అదృష్టం ఓ ముగ్గురి స్నేహితులను వరించింది. దీంతో వారి పెట్టిన ఖర్చుకు సుమారు ఏడింతల డబ్బును అధికంగా పొందారు. ఖర్చు పెట్టిన దానికి ఏడింతల డబ్బు ఎక్కవగా పొందారంటే.. వారేదో లక్కీలాటరీని గెలుచుకున్నారో లేక జూదంలో సంపాదించారనో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. జూదమూ ఆడక, లాటరీ గెలవక.. మరెలా వాళ్లు అంత డబ్బు పొందారు అని ఆలోచిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..



ముగ్గరు స్నేహితులకు తాజాగా ఓ పాత ఏటీఎం మెషీన్‌కు సంబంధించిన ప్రకటన కంటపడింది. ఈ క్రమంలో వారు.. దాన్ని కనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. అనంతరం ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి తలా కొంత వేసుకుని 300 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.22,000)తో ఆ ఏటీఎం మెషీన్‌ను కొనుగోలు చేసి, తెచ్చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఓ ఆలోచన వచ్చింది. ఆ పాత ఏటీఎం మెషీన్‌‌లో ఏమైనా డబ్బు దొరుకుతుందేమో చూద్దాం అనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇనుప పనిముట్ల సహాయంతో ఆ మెషీన్‌ను ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో వారికి 2వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.1.49లక్షలు) అందులో లభించాయి. దీంతో ఆ స్నేహితులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు. ఏటీఎం ఓపెన్ చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాతో పోస్ట్ చేస్తూ.. తాము డబ్బు పొందిన విషయాన్ని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.




Updated Date - 2021-10-06T21:49:25+05:30 IST