Abn logo
Sep 28 2021 @ 10:49AM

తల్లి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూసి చలించిపోయిన కుమారులు.. అందరూ కలిసి ఏం చేశారో తెలిస్తే..!

‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం...ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం...’ అని ఒక రచయిత పాట ద్వారా తన భావాన్ని వినిపించాడు. అయితే దీనికి భిన్నంగా అనుబంధం, ఆత్మీయత, ఆప్యాయతలే జీవితసారమని  మధ్యప్రదేశ్‌లోని ఒక కుటుంబానికి చెందినవారు నిరూపించారు. షాజాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి... భార్య మరణించిన నేపధ్యంలో ఆమెకు గుర్తుగా ఆలయం నిర్మించాలనుకున్నాడు. 

తండ్రి నిర్ణయాన్ని గ్రహించిన కుమారులు అతనికి మద్దతుగా నిలిచారు. వారంతా కలిసి తమ తల్లికి ఆలయం నిర్మించారు. ఇప్పుడు ఆ ఆలయంలో భార్య ప్రతిమను కొలువుదీర్చి భర్త ఆమెకు ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు. ఈ ఉదంతం సాంప్‌ఖెడా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నారాయణ్ సింగ్ బంజారా భార్య గీతాబాయి కరోనాతో ఈ ఏడాది ఏప్రిల్ 27న మృతి చెందింది. ఆమె ఎంతో భక్తి భావాలతో మెలిగేది. రాజస్థాన్‌లోని బాబా రామ్‌దేవ్ మందిరానికి తరచూ వెళుతుండేది. నారాయణ్ సింగ్‌ భార్య విషయంలో ఎంతో ప్రేమగా మెలిగేవాడు.

గీతాబాయి మృతి చెందిన అనంతరం ఆమెకు ఆలయం నిర్మించాలని భర్త నారాయణ్ సింగ్ భావించాడు. ఈ విషయాన్ని కుమారులకు చెప్పాడు. వారు తండ్రి నిర్ణయానిక మద్దతు పలికారు. గీతాబాయి విగ్రహం తయారు చేసే పనిని రాజస్థాన్‌కు చెందిన కళాకారునికి అప్పగించారు. ఇందుకోసం రూ. 50 వేలు వెచ్చించారు. ఆ విగ్రహాన్ని కుటుంబ సభ్యులంతా ఆలయానికి తీసుకువచ్చి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. వారి ఇంటి బయటనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతిరో్జూ ఉదయం, సాయంత్రం వేళల్లో గీతాబాయికి... నారాయణ సింగ్, అతని కుమారులు పూజలు నిర్వహిస్తుంటారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...