Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ మూడింట్లో...

ఆంధ్రజ్యోతి(08-07-2021)

బరువు తగ్గాలంటే ఎంతో కొంత కొవ్వు ఆహారంలో ఉండి తీరాలి. అయితే ఆ కొవ్వు కోసం ఆలివ్‌ నూనె, వెన్న, నెయ్యిలలో దేన్ని ఎంచుకోవాలో తెలుసుకోవాలి. ఈ మూడూ వేటికవి ఆరోగ్యకరమైనవే! వాటిలోని పోషకాలు, అందించే క్యాలరీల ఆధారంగా అనువైన కొవ్వును ఎంచుకోవచ్చు. ఈ మూడు కొవ్వుల మధ్య తేడాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!


వెన్న: కీటో డైట్‌లో ప్రధాన పాత్ర పోషించే వెన్న నూనెకు చక్కని ప్రత్యామ్నాయం. పరిమితంగా తీసుకున్నంతకాలం దీనితో ఆరోగ్య ప్రయోజనాలను నిస్సందేహంగా పొందవచ్చు. పాల నుంచి తయారుచేసిన వెన్నలో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉండవు. పైగా విటమిన్‌ ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్స్‌, క్యాల్షియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అత్యధిక కొవ్వు కలిగిన వెన్న తినడం వల్ల ఊబకాయం, గుండెజబ్బులు రాకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఒక స్పూను వెన్నలో 100 క్యాలరీల శక్తి, కేవలం 12 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది.


ఆలివ్‌ నూనె: అత్యంత ఉత్తమమైనదిగా పేరు తెచ్చుకున్న మెడిటరేనియన్‌ డైట్‌లో ఆలివ్‌ నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్లో మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆకలిని తీర్చి, అధిక బరువును తగ్గించే గుణం వీటికి ఉంటుంది. ఒక టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనెలో 119 క్యాలరీలు, 13.5 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ట్రేస్‌ కెమికల్స్‌ ఉంటాయి. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో మిగతా ఆలివ్‌ నూనెల్లో లేనన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.


నెయ్యి: నెయ్యి తింటే బరువు పెరుగుతాం అనే అపోహ నుంచి బయటపడి, బరువు తగ్గించే పోషకంగా దాని వాడకాన్ని ఇటీవలే పెంచుకున్నాం. దీన్లో విటమిన్‌ ఎ, డి, కె మొదలైన ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్లు ఉంటాయి. దీని స్మోకింగ్‌ పాయింట్‌ అధికం కాబట్టి అన్ని రకాల వంటలకూ ఇది అనుకూలమైనది. దీన్లో కెసీన్‌ ఉండదు కాబట్టి పాలపదార్థాలు సరిపడని వాళ్లు కూడా నెయ్యి నిస్సందేహంగా తినవచ్చు. నెయ్యిలోని ఎంజైమ్స్‌ పేగులకు చేటు చేయవు. కాబట్టి ఇది తేలికగా అరుగుతుంది. ఒక టీస్పూను నెయ్యిలో 115 క్యాలరీలు, 9.3 గ్రాముల శాచురేటెడ్‌ ఫ్యాట్‌, 38.4 గ్రాముల కొలెస్ట్రాల్‌, 0 పిండిపదార్థాలు ఉంటాయి. వెన్నకు లాగే దీన్నీ పరిమితంగా వాడుకోవడం ఆరోగ్యకరం.

Advertisement
Advertisement