Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 12:22PM

వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు.


చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. దీంతో సుమారు ఓ సంవత్సరం నుంచి ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు విజయం సాధించారు. 


Advertisement
Advertisement