car falls into well: బావిలోకి దూసుకెళ్లిన కారు...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-09-09T17:18:44+05:30 IST

వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడిన ఘటనలో(car falls into well) ముగ్గురు యువకులు మరణించిన ఘటన...

car falls into well: బావిలోకి దూసుకెళ్లిన కారు...ముగ్గురి మృతి

కోయంబత్తూర్(తమిళనాడు): వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడిన ఘటనలో(car falls into well) ముగ్గురు యువకులు మరణించిన ఘటన తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని కోయంబత్తూర్ సమీపంలో శుక్రవారం జరిగింది. కోయంబత్తూర్ సమీపంలో కారు వేగంగా పోతూ అదుపు తప్పి 120 అడుగుల లోతున్న బావిలో పడింది. 18 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు కారులో వేగంగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రోషన్ అనే యువకుడు కారు నడుపుతున్నాడు. ఈ కారు బావిలో పడిన ఘటనలో ఆదర్శ్, రవి, నందన్ లు మరణించారు.కోయంబత్తూరులో ఓనం వేడుకలను జరుపుకొని శుక్రవారం తిరిగి వస్తుండగా కారు ప్రమాదవశాత్తూ(accident) బావిలో పడింది.(drowned)


 బావి చుట్టూ ఉన్న ఇనుపగ్రిల్ ను ఛేదించుకొని కారు బావిలో పడింది. డ్రైవింగ్ చేస్తున్న రోషన్ డోర్ తీసుకొని బయటపడ్డాడు.కారులో ఉన్న మిగిలిన నలుగురు నీటిలో మునిగి మరణించారు. క్రేన్ సహాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు.   


Updated Date - 2022-09-09T17:18:44+05:30 IST