ముంబై : పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సంస్థకు గ్రహణం పట్టినట్లుందన్న వ్యాఖ్యానాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామా నేపధ్యంలో... కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)కి చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేయడంతో గురువారం ఇంట్రా-డేలో పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు బీఎస్ఈలో 19 శాతం క్షీణించి రూ. 20.65 కు పడిపోయాయి. పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ మాతృ సంస్థ పీటీసీ ఇండియా షేర్లు బీఎస్ఈలో ఏడు శాతం క్షీణించి, రూ. 104.50 కు చేరుకున్నాయి.
ఎస్అండ్పీ బీఎస్ఈ 0.37 శాతం క్షీణతతో పోలిస్తే... పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ 13 శాతం క్షీణించి, రూ. 22.35 వద్ద ఉంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 16 మిలియన్ ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం దాదాపు రెట్టింపయ్యింది. ‘కొన్ని కారణాలతో ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల నుంచి రాజీనామాలను స్వీకరించాం. ఈ అంశం బోర్డు స్థాయిలో పరిష్కారం కావాల్సి ఉంటుంది. కాగా... ఈ క్రమంలో తీసుకోవల్సిన చర్యల గురించి వాటాదారులకు తెలియజేయడం జరుగుతుంది’... అనిత ఫైలింగ్‌లో పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజి వెల్లడించింది. కమలేష్ శివ్జీ వికామ్సే, థామస్ మాథ్యూ టి. సంతోష్ బి. నాయర్లు కంపెనీ డైరెక్టర్ల పదవి నుంచి వైదొలిగారు.
ఇవి కూడా చదవండి