కరోనాతో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-11-01T06:39:53+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కరోనా మృతులు సంఖ్య పెరుగుతోంది. శనివారం రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు కొవిడ్‌తో మృతి చెందగా వికారాబాద్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు.

కరోనాతో ముగ్గురి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఉమ్మడి జిల్లాలో కరోనా మృతులు సంఖ్య పెరుగుతోంది. శనివారం రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు కొవిడ్‌తో మృతి చెందగా వికారాబాద్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 310కి చేరుకుంది.


398 కేసులు..

శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 398 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లాలో 210 కేసులు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మూడు జిల్లాల్లో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 96,240కి చేరుకుంది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో...

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శనివారం 10 కేంద్రాల్లో 235 మందికి యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా 27 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నంలో 3, మంచాల 3, దండుమైలారం 4, తట్టిఅన్నారం 5, రాగన్నగూడ 8, అబ్దుల్లాపూర్‌మెట్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


చేవెళ్ల డివిజన్‌లో...

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 181 మందికి కరోనా పరీక్షలు చేయగా 10 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యధికారులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసు పత్రిలో 19 మందికి పరీక్షలు చేయగా ఐదుగురు,  శంకర్‌పల్లి మండలంలో 44 మందికి  పరీక్షలు చేయగా  ఇద్దరికి,  షాబాద్‌ మండలంలో 44 మందికి  పరీక్షలు చేయగా  ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆలూర్‌ పీహెచ్‌సీలో 33 మందికి, మొయినాబాద్‌ మండలంలో 41 మందికి పరీక్షలు చేయగా ఇందులో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌డివిజన్‌లో 211 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా  ఏడుమందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ముగ్గురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ఇద్దరు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఒకరు, కొందుర్గు మండలానికి చెందిన  మరొకరు ఉన్నారు.

 

వికారాబాద్‌ జిల్లాలో...

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం వికారాబాద్‌లో 5 కేసులు, పరిగిలో 3, తాండూరులో 3, ధారూరు, దౌల్తాబాద్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌సింధే తెలిపారు.  

 

మైలారంలో...

దోమ: దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో 68 మందికి కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగెటివ్‌ వచ్చిందని డాక్టర్‌ మునీబ్‌ తెలిపారు. 

 

మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 56 మందికి  కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. శ్రీరంగవరంపీహెచ్‌సీలో ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా  నెగెటివ్‌ వచ్చిందని వైద్యురాలు నళిని తెలిపారు. 

Updated Date - 2020-11-01T06:39:53+05:30 IST