కరోనాతో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-10-17T06:23:13+05:30 IST

ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, వికారాబాద్‌ జిల్లాలో

కరోనాతో ముగ్గురి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, వికారాబాద్‌ జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటివరకు రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 286కు చేరుకుంది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 436కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 219, మేడ్చల్‌ జిల్లాలో 200, వికారా బాద్‌ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 90,546కు చేరుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 144 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 20మందికి, ఆలూర్‌ ప్రాథమిక ఆసుపత్రిలో 25మందికి, శంకర్‌పల్లి మండ లంలో23 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. మొయినాబాద్‌ మండలంలో 42మందికి పరీక్షలు చేయగా ఒకరికి, షాబాద్‌ మండలంలో 34 మందికి  పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. షాద్‌నగర్‌ కమ్యూనిటీ కేంద్రంతోపాటు పీపీయూనిట్‌, నందిగామా, కొత్తూర్‌, కేశంపేట, కొందుర్గు, చించోడ్‌, బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 239 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో షాద్‌నగర్‌ పీపీ యూనిట్‌లో ఐదుగురికి, కొందుర్గులో ఇద్దరికి, కొత్తూర్‌ ఒకరికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం / కందుకూరు : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11 కేంద్రాల్లో 232 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌ వచ్చింది. సీహెచ్‌సీ ఇబ్రహీంపట్నంలో ముగ్గురికి, యాచారంలో ఇద్దరికి, మంచాలలో ఒకరికి,  ఎలిమినేడులో ఇద్దరికి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముగ్గురికి, తట్ట్టిఅన్నారంలో ఒకరికి, రాగన్నగూడలో నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 33మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కందుకూరు గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌  వచ్చింది. 


కులకచర్లలో..

కులకచర్ల: కులకచర్లలో కొత్తగా ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అడవి వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడికి పాజిటివ్‌ వచ్చింది.


కీసరలో..

కీసర: కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 63 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-17T06:23:13+05:30 IST